SDPT: రైతులు పంట కోత తర్వాత పొలాల్లో మిగిలే అవశేషాలు, ఎండిన గడ్డిని కాల్చవద్దని రాయపోల్ ఎస్ఐ మానస సూచించారు. ఇలా కాల్చడం వల్ల భూమి సారవంతత తగ్గి మట్టిలోని ఉపయోగకర సూక్ష్మజీవులు నశిస్తాయని తెలిపారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరిగి ఇళ్లు, గడ్డి వాములు, విద్యుత్ తీగలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.