SRPT: మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. కోదాడ నుంచి బరాఖత్ గూడెం వైపు బైక్‌పై వస్తున్న నారగాని వెంకట్‌ను, మరో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు ఎదురుగా వచ్చి ఢీకొట్టారు. ప్రమాదంలో వెంకట్‌తో పాటు మరో బైక్‌పై ఉన్న మణికంఠ మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.