రాత్రిపూట అన్నం మానేసి టిఫిన్ తినడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే టిఫిన్ రకాన్ని బట్టి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇడ్లీ, ఉప్మా వంటివి త్వరగా జీర్ణమై శరీరానికి హాయినిస్తాయి. కానీ, నూనెలో వేయించిన పదార్థాలతో ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాత్రిపూట జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే తేలికపాటి టిఫిన్‌తో ముగించడం మంచిది.