జింబాబ్వేతో మ్యాచ్లో భారత బ్యాటర్లు 17 సిక్సర్లు బాదారు. T20 WCలోని ఒకే మ్యాచ్లో టీమిండియా ఇన్ని సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, ప్రస్తుత WCలో భారత్ మొత్తంగా 63 సిక్సర్లు నమోదు చేసింది. దీంతో ఒకే WC ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. వెస్టిండీస్ ఇదే ప్రపంచకప్లో 66 సిక్సర్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.