SRCL: సిరిసిల్ల పొక్సో కోర్టు మైనర్ బాలికపై 2021లో జరిగిన వేధింపుల కేసులో ఇవాళ ఇద్దరు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, నేరం రుజువుకావడంతో కోర్టు తీర్పు వెలువరించింది. కేసులో కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేష్ అభినందించారు.