కొత్త బట్టలు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే వాటి ట్యాగ్‌లపై ఉండే గుర్తులను గమనించాలి. ట్యాగ్‌పై సర్కిల్ ఉంటే డ్రైక్లీన్ చేయాలి, బకెట్లో చేయి గుర్తుంటే చేతితోనే ఉతకాలి. త్రిభుజం బ్లీచింగ్‌ను, చతురస్రం ఆరబెట్టే పద్ధతిని సూచిస్తాయి. ట్విస్ట్ గుర్తుపై ఇంటూ ఉంటే బట్టలు గట్టిగా పిండకూడదు. ఈ జాగ్రత్తలతో దుస్తుల క్వాలిటీని కాపాడుకోవచ్చు.