TG: రాష్ట్ర ప్రభుత్వం బక్రీద్ పండగ సెలవుదినాన్ని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పాత క్యాలెండర్ ప్రకారం మే 27(బుధవారం) ఇవ్వాల్సిన బక్రీద్ సెలవును మే 28 (గురువారం) నాటికి మారుస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులకు ఈ మార్పు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.