కృష్ణా: వేసవి తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా గుడివాడ ఆర్టీసీ బస్టాండ్లో శనివారం హోమియో మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గురురాజు హోమియోపతి హాస్పటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని డిపో మేనేజర్ సునీల్ కుమార్ ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.