VKB: ధారూర్ మండల కేంద్రంలో ఐకేపీ-వీఓఏ (VOA)ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు వికారాబాద్ అసెంబ్లీ బీజేపీ కో- ఆర్డినేటర్ వడ్ల నందు మద్దతు ప్రకటించి, నిరసనలో పాల్గొన్నారు. వీఓఏల గౌరవ వేతనం పెంపు, పనిభారం తగ్గింపు, ఉద్యోగ భద్రత కల్పించాలనే న్యాయమైన డిమాండ్లను ఆయన లేవనెత్తారు. బీజేపీ మండల అధ్యక్షుడు రాజ్ నాయక్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.