కొన్ని రోజుల్లోనే మిగతా డబ్బు కూడా సర్దుబాటు అయ్యేలా ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఎందరో మహానుభావులు స్పందించి నిర్వాణ్ కు పునర్జన్మ కల్పిస్తున్నారు. త్వరలోనే నిర్వాణ్ కు వైద్యం అందించనున్నారు. మనుషుల్లో మానవత్వం దాగి ఉందని ఇలాంటి సంఘటనలు చూస్తే తెలుస్తున్నది.
తోటి వారికి కష్టమొస్తే ఆదుకునే లక్షణం ఉంటే దానినే మానవత్వం (Humanity).. సేవా గుణం (Service).. దయ.. జాలి అనేవి అంటారు. ఇవి లేకుంటే ఆ మనసున్న మనిషిగా గుర్తించలేం. రోజువారీ జీవితంలో దానం.. సేవ చేస్తే కలిగే అనుభూతి, భావం ఏం చేసినా రాదు. ఉన్నంతలో కొంత ఇస్తే చాలు. సేవ అనేది ఎంత మొత్తంలో కాదు.. ఎంత గొప్ప మనసుతో చేశామనేది ముఖ్యం. తాజాగా ఓ వ్యక్తి చిన్నారి వైద్యానికి ఏకంగా రూ.11 కోట్లు దానం (Donation)గా ఇచ్చాడు. ఆ చిన్నారి పాలిట దేవుడుగా మారాడు. అత్యంత ఖరీదైన వైద్యానికి ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న కష్టాలు చూసి ఆయన గొప్ప మానవతా దృక్పథంతో భారీ విరాళం అందించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కేరళ (Kerala)లోని ఎర్నాకుళా (Ernakulam)నికి చెందిన నౌకాదళ అధికారి (Indian Navy Officer) సారంగ్. ఆయనకు భార్య అతిథి, కుమారుడు నిర్వాణ్ (Nirvan) (16 నెలలు) ఉన్నాడు. అయితే నిర్వాణ్ కు 15 నెలలు దాటినా కాళ్లు కదలడం లేదు. దీంతో వైద్యులకు చూపించగా స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి (ఎస్ఎంఏ) Spinal Muscular Atrophy (SMA) టైప్-2 వ్యాధి ఉన్నట్లు తెలిపారు. దీనికి మందులు, చికిత్స ఉంది.. కానీ నిర్వాణ్ కు రెండేళ్ల వయసులోపే వేయాల్సి ఉందని వైద్యులు వివరించారు. అయితే చికిత్స, మందులు అమెరికా (USA) నుంచి తెప్పించేందుకు ఏకంగా రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. అంత మొత్తంలో చెప్పేసరికి ఆ చిన్నారి తల్లిదండ్రుల్లో నోట మాట రాలేదు. ఏం చేయాలో సారంగ్, అతిథిలకు తోచలేదు. కొందరి సహాయంతో సోషల్ మీడియాలో బాలుడి వైద్యానికి కావాల్సిన డబ్బు కోసం పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు ఊహించని స్పందన లభించింది. క్రమంగా చిన్నారి వైద్యానికి చాలా మంది స్పందిస్తూ వాళ్లకు తోచిన సహాయాన్ని ఆన్ లైన్ (Online)లో వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా రూ.11 కోట్లు విరాళంగా అందించాడు.
అంత మొత్తంలో జమ కావడంపై సాగర్ (Sagar), అతిథి (Adhithi) దంపతులు నమ్మలేకపోయారు. వివరాలు పరిశీలిస్తే ఖాతాలో రూ.11 కోట్లు జమయ్యాయి. దీంతో ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి ప్రాణం నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే అంత మొత్తంలో విరాళం ఇచ్చిన వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. అతడి వివరాలు తెలియలేదు. భూరి విరాళం అందించిన ఆ వ్యక్తికి (Unknown Person) కుటుంసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. తమ చిన్నారికి పునర్జన్మ (Rebirth) ఇచ్చారని పేర్కొన్నారు. తాజా విరాళంతో వైద్యానికి కావాల్సిన డబ్బు దాదాపు సరిపోయింది. ఇంకా రూ.70 లక్షలు రావాల్సి ఉంది. కొన్ని రోజుల్లోనే మిగతా డబ్బు కూడా సర్దుబాటు అయ్యేలా ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఎందరో మహానుభావులు స్పందించి నిర్వాణ్ కు పునర్జన్మ కల్పిస్తున్నారు. త్వరలోనే నిర్వాణ్ కు వైద్యం అందించనున్నారు. మనుషుల్లో మానవత్వం దాగి ఉందని ఇలాంటి సంఘటనలు చూస్తే తెలుస్తున్నది. చిన్నారి వైద్యానికి స్పందించిన వారందరికీ నిర్వాణ్ తల్లిదండ్రులు సాగర్, అతిథి ధన్యవాదాలు తెలిపారు.