ఎండల తీవ్రత పెరిగిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఎండల వల్ల డీహైడ్రేషన్, మూర్ఛ, వడదెబ్బ వంటి ప్రాణాపాయ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. తల తిరగడం, వాంతులు, తలనొప్పి, గందరగోళం, వేగంగా గుండె కొట్టుకోవడం, అపస్మారక స్థితి వంటి లక్షణాలను ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దని తెలిపింది. నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.