NDL: నంద్యాల మండలం కానాల గ్రామ చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాల వ్యవహారంలో తన పేరు అనవసరంగా లాగడం దారుణమని శనివారం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అన్నారు. మట్టి తవ్వకాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకుంటున్నారని ఆరోపిస్తూ, అధికారులు విచారణ చేపట్టాలని కోరారు.