SRPT: మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఎండల తీవ్రత దృష్ట్యా ORS ప్యాకెట్లను ఉప సర్పంచ్ నందిగామ సుశీల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రావులపెంట శ్రీను, ANM సత్యవతి, ఆశా వర్కర్ ములకలపల్లి లక్ష్మి, వార్డు సభ్యులు నందిగామ సైదులు, కామల్ల మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.