AKP: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టాలని రాంబిల్లి తహసీల్దార్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వర్షబావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.