అన్నమయ్య: రాయచోటిలో బక్రీద్ పండుగ సందర్భంగా జరుగుతున్న గోవధ ఏర్పాట్లను అడ్డుకోవాలని బీజేపీ, విశ్వహిందూ పరిషత్ నేతలు శివ గంగిరెడ్డి, శ్రీనివాసకుమార్ రాజు, శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాయచోటి సీఐ చలపతికి వినతిపత్రం ఇచ్చారు. పట్టణంలో పలు చోట్ల గోవధ శాలల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. బయటి ప్రాంతాల నుంచి గోవులను తెస్తున్నారని అన్నారు.