ఎన్టీఆర్ జిల్లాలో గోవధ నిషేధం, జంతు సంక్షేమ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. రెడ్డిగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.