WG: తణుకులో శుక్రవారం ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకున్నాయి. నాలుగు రోజులుగా గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శుక్రవారం 44 డిగ్రీలకు చేరింది. తీవ్రమైన వడగాలులు నేపథ్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రధాన కేంద్రం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తణుకు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.