MDK: పశువుల అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ ఉండదని, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డివి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధి కొల్లపల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.