TPT: సత్యవేడు సబ్ జైలును త్వరలో మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత భవనాలు పూర్తిగా మరమ్మతుకు గురయ్యాయని పేర్కొన్నారు. గతంలో ఖైదీలు గోడ దూకి పరారైన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. సబ్ జైల్ మూసివేతపై ఇప్పటికే జ్యుడీషియల్ కోర్టుకు సమాచారం అందించినట్లు సబ్ జైల్ ఇంఛార్జ్ సూపరింటెండెంట్ వాసు తెలిపారు.