సత్యసాయి: నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయంలో నేడు ‘ఒక నెల – ఒక నియోజకవర్గం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి, డిఆర్ఓ కొండయ్య హాజరవుతారన్నారు. ప్రజల నుంచి రెవెన్యూ, ఇతర సమస్యలపై అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.