ATP: ఆధార్ కేంద్రాలలో తలెత్తిన సమస్యలు, అధిక వసూళ్లపై కలెక్టర్ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. పత్రికల్లో ప్రచురితమైన వార్త కథనాలకు స్పందించిన ఆయన, దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆధార్ జిల్లా నోడల్ అధికారిని ఆదేశించారు. మార్పుచేర్పుల్లో తప్పులు దొర్లడం, నిర్వాహకులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేయడంపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.