MHBD: తొర్రూరు మండలంలోని సోమారం గ్రామానికి చెందిన మేడి సందీప్ గౌడ్ కాలేయ వ్యాధి బారిన పడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చులు చెల్లించలేని ఆ కుటుంబ దినస్థితిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తొర్రూరుకు చెందిన ట్రాన్స్ జెండర్స్ ముందుకొచ్చి తమ వంతు రూ. 10వేలు ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.