BPT: జే.పంగులూరు మండలం ముప్పవరం-కొండమూరు గ్రామాల మధ్య పొలాల్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో సుమారు 300 ఎకరాల మొక్కజొన్న, సుబాబుల్, మామిడి తోటలు దగ్ధమయ్యాయి. వ్యవసాయ మోటార్లు, పైపులు కూడా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.