NLG: మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇసుక అక్రమ రవాణాదారులకు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్రమ రవాణాను అరికట్టడంతో ప్రభుత్వ ఆదాయం పెరిగిందన్నారు. 2024లో రూ.35 కోట్లు, 2025లో రూ.43 కోట్లు ఉన్న ఆదాయం.. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.83 కోట్లకు చేరిందని వెల్లడించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.