TG: చైనా, జపాన్, కొరియా దేశాలకు మన రాష్ట్రం ప్రత్యామ్నాయం కావాలని సీఎం రేవంత్ అన్నారు. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా టాటా సంస్థతో కలిసి ఏటీసీలను అప్గ్రేడ్ చేస్తున్నామని, నయా కోర్సులు తీసుకువస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల రక్షణ కోసం త్వరలోనే ఒక మంచి పాలసీని తీసుకువస్తామని సీఎం హామీ ఇచ్చారు.