AP: రాష్ట్రంలో పెట్టుబడిదారులకు సింగిల్ పోర్టల్ ద్వారా వేగంగా సేవలు అందించాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు. భూకేటాయింపుల్లో పర్యాటక రంగానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్‌ను ‘గోవా ప్లస్’ రేంజ్లో అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని, పర్యాటక ప్రాజెక్టుల వేగవంతానికి చర్యలు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు.