రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా చరణ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో తనకు అత్యంత ఇష్టమైనది ఢిల్లీ ఎపిసోడ్” అని వెల్లడించాడు. కథలో ఎన్నో మలుపులు ఉండే ఈ ఎపిసోడ్, బుచ్చిబాబు మునుపటి చిత్రం ‘ఉప్పెన’ క్లైమాక్స్ ట్విస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువగా అలరిస్తుందని చరణ్ ధీమా వ్యక్తం చేశాడు.