BPT: బల్లికురవ ప్రజలను నిరంతరం అప్రమత్తం చేసేందుకు బల్లికురవ నాలుగు రోడ్ల కూడలిలో పోలీసులు ‘పబ్లిక్ అడ్రస్ సిస్టం’ ఏర్పాటు చేశారు. దీని ద్వారా సైబర్ నేరాలు, దొంగతనాలు, మహిళలపై అఘాయిత్యాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్, బెట్టింగ్ మాఫియాపై ఆడియోల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. గతంలోనూ గ్రామాల్లో ఆటో మైకుల ద్వారా ప్రచారం చేశామని పోలీసులు గుర్తుచేశారు.