JGL: చెరువులలో నుంచి అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి అన్నారు. గొల్లపల్లి మండలంలోని చిల్వాకోడూర్ గ్రామ శివారులో గల పెద్ద చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీ, 10 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గొల్లపల్లి ఆర్ఐ- 1 బాపురెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.