TG: రాజీవ్ గాంధీకి తనకు చాలా సన్నిహిత బంధం ఉందని కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నారు. తనను సీఎం చేస్తానని హామీ ఇచ్చి ఆయన మరణించడం తన దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని కుటుంబ పార్టీ అంటారా? బీజేపీలో దేశం కొరకు ప్రాణాలు అర్పించిన ఒక్కరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇవాళ మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ చొరవే అని తెలిపారు.