AP: కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన విమర్శల హాస్యాస్పదం అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ‘హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల గురించి జగన్ మాట్లాడటం విడ్డూరం. 5 కి.మీ దూరానికి హెలికాప్టర్లో వెళ్లి జగన్ ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రత్యేక విమానాల కోసం ఐదేళ్లలో రూ.222 కోట్ల ఖర్చు చేశారు. మావిగన్ పేరు వింటేనే ప్రజలు నవ్వుతున్నారు’ అని అన్నారు.