ప్రకాశం: పామూరు మండలం చింతలపాలెం అంగన్వాడీ కేంద్రంలో “కిశోరీ వికాసం” ప్రత్యేక వేసవి శిబిరాల కార్యక్రమం ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.వీ.ఎస్. పార్వతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 11–18 సంవత్సరాల మధ్య వయస్సు గల కౌమార బాలబాలికల సమగ్ర అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.