ఏలూరు నుంచి విజయవాడ వరకు ఒడిస్సా రైళ్లలో పోలీస్, ఈగల్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా గురువారం తనిఖీలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే తెలియజేయాలని కోరారు.