AP: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని MP లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. చారిత్రాత్మక కొండవీడు కోటకు రోడ్డు కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోనే ఇది ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఎదిగేందుకు అన్ని అర్హతలూ, అవకాశాలూ ఉన్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. NH-16, NH-544Dల నుంచి కొండవీడు కోటను కలుపుతూ రెండు 4-లేన్ల స్పుర్ రోడ్లను నిర్మించాలని కోరారు.