TG: కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా బహిరంగ నోటీసును జారీ చేసింది. ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ రిజిస్ట్రేషన్‌పై ఎవరికైనా, ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే వాటిని జూన్1లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని పేర్కొంది.