SRPT: ఆసుపత్రులపై దాడులకు పాల్పడినా, వైద్య సిబ్బందిని గాయపరిచినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. గురువారం ఐఎంఏ ప్రతినిధులు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డాక్టర్లు నాణ్యమైన వైద్యం అందించాలని, ప్రజలు దాడులు చేయకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.