RR: మంత్రి పొన్నం ప్రభాకర్ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్, పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని ఆదేశించారు. 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలను అభినందిస్తూ, తక్కువ ఫలితాలు వచ్చిన ప్రిన్సిపాళ్లను హెచ్చరించారు. ఎంజేపీకి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని సూచించారు.