NLR: కొడవలూరు మండల కేంద్రంలోని పంచాయతీలో గురువారం ఆధార్ కేంద్రాన్ని ఎంపీడీవో వెంకట సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆధార్ కేంద్రంలో నూతన ఆధార్ కార్డులు నమోదు చేయుట, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేయడం, తదితర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.