E.G: పోలవరం జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామపంచాయతీ ఎస్సీ, ఎస్టీ కాలనీవాసులు రాజమండ్రిలోని ఎమ్మెల్సీ సోము వీర్రాజును కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దశాబ్దాలుగా నిలిచిపోయిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే తాగునీటి ఎద్దడి తీర్చడానికి 60 వేల లీటర్ల సామర్థ్యంతో కొత్త ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు.