VZM: తెలంగాణలోని గద్వాల్లో ఇటీవల జరిగిన జాతీయ తైక్వాండో పోటీల్లో బొబ్బిలి క్రీడాకారులు మెరిశారు. ఎస్. జాజిలి, బి. శివరామకృష్ణ బంగారు పతకాలు, ఎస్. హేమచందర్ రజత పతకం, ధర్మాన ఉమాసాయి కాంస్య పతకం సాధించారు. క్రీడాకారులను మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి గురువారం అభినందించారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించి బొబ్బిలికి మంచి పేరు తీసుకురావాలన్నారు.