KMM: మధిర మండలం నాగవరపాడులో గత కొంతకాలంగా లో వోల్టేజీతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వేసవిలో ఉపశమనం లభించింది. గురువారం విద్యుత్ శాఖ అధికారులు గ్రామంలో సర్పంచ్ ఈశ్వరమ్మ విజ్ఞప్తి మేరకు 11 కెవి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి వోల్టేజి సమస్యకు చెక్ పెట్టారు. లో-వోల్టేజీ సమస్యను పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.