TG: మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు “మహిళా వారోత్సవాలు” నిర్వహించనుంది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యులను చేయనుంది. మే 29న HYDలో సీఎం రేవంత్.. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభించనున్నారు.