SRD: సదాశివపేట మండలం మద్దికుంట చౌరస్తా వద్ద NH-65పై గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల.. ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి ఓ కారు అదుపుతప్పి వెనుక నుండి ఢీ కొట్టి బోల్తా పడింది. కారులో ఉన్న ఐదుగురిలో ఒకరు అక్కడికి ఇక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన మిగతా వారిని 108లో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.