NRPT: ఊట్కూర్లోని రుద్రనగర్ వీధిలో ప్రైవేట్ పాఠశాల ఏర్పాట్ల సందర్భంగా భవనం హద్దులు అతిక్రమించి క్రీడా సామగ్రి ఏర్పాటు చేస్తున్నారని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఆరోపించారు. ఆక్రమించిన స్థలం సమీపంలోని స్వామివారి దేవాలయ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ గ్రామ సర్పంచ్, కార్యదర్శి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.