సత్యసాయి: మంత్రి సవిత మానవత్వాన్ని చాటుకున్నారు. తాడేపల్లిలో రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఫ్రాన్సిస్ అనే యువకుడి పరిస్థితిని గమనించి గురువారం ఆయనకు తోపుడు బండి అందజేశారు. ఎండ, వానలను లెక్కచేయకుండా గోనెలపై కూరగాయలు విక్రయిస్తున్న యువకుడికి మంత్రి అండగా నిలవడంతో ఫ్రాన్సిస్ ఆనందం వ్యక్తం చేస్తూ జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు.