PPM: జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు తీవ్ర ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని 15 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41°C నుంచి 54°C వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని, నీరు, మజ్జిగ, ORS తీసుకుంటూ వడదెబ్బ నుంచి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.