W.G: ఆకివీడులో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గురువారం ఆకివీడులో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బయటికి రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. జాతీయ రహదారిపై తలకు పాగాలు వేసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు. శీతల పానీయాలకు డిమాండ్ పెరిగింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు తెలిపారు.