KRNL: ఆదోనిలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి గుమ్మలా భాస్కర్ మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, జయ మనోజ్ రెడ్డి స్పందించారు. గురువారం భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ధైర్యంగా ఉండాలని సూచించారు.