SDPT: జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం అమలుకు అధికారులు చర్యలను వేగవంతం చేశారు. ఈ పథకం కింద భూంపల్లి, తొగుట, వర్గల్, దుద్దెడ గ్రామాల్లోని గృహ జ్యోతి సర్వీస్ కనెక్షన్లకు 2 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, ప్రజల విద్యుత్ ఖర్చులను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు.