TG: జనగణన సర్వేలో అధికారులకు ప్రజల నుంచి వింత సమాధానాలు వస్తున్నాయట. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంచుకుని.. కీ ప్యాడ్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు.. అలాగే ఇంటి ముందు కారు, బైక్ ఉంటే అవి పక్కింటోళ్లవని, బంధువులవని సమాధానమిస్తున్నారట. ప్రతి వంద మందిలో 50 మంది తమ సొంతింటిని అద్దె ఇల్లుగా.. అలాగే మేడలో ఉంటూ.. ఒకే రూంలో ఉంటున్నట్లు చెప్తున్నారట. అయితే వాటినే అధికారులు నమోదు చేసుకుంటున్నారు.